ఇటిక్యాల వెలుగు : మాతృత్వం వరమైతే, చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవడం మరో వరమని జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ ఇన్‌చార్జి జోగు రవి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఇటీక్యాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చట్టబద్ధ దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ ఇన్‌చార్జి జోగు రవి మాట్లాడుతూ - పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే భార్యాభర్తలు తమ ఫోటోలు, నివాస ధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, ప్రాణాంతక వ్యాధులు లేనట్లు సర్టిపికెట్ సమర్పించాలని సూచించారు.
.దత్తత కోసం దరఖాస్తు రూ.6,000 దత్తత తీసుకున్న తర్వాత రూ.50,000/- ను డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని తెలిపారు. దత్తతకు సంబంధించిన సమాచారం కోసం ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు కార్యాలయం, శిశు గృహం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం లేదా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్‌వైజర్ అనూష, శేఖర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
