పక్కాగా ఓటరు తుది జాబితా : క్రిస్టినా జడ్​చోంగ్తూ

పక్కాగా ఓటరు తుది జాబితా : క్రిస్టినా జడ్​చోంగ్తూ

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ ముగిశాక ఫైనల్​ లిస్టు పక్కాగా ఉండేలా చూడాలని జిల్లా పరిశీలకురాలు, ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్ ​చొంగ్తూ సూచించారు. బుధవారం ఆమె జిల్లాలోని పడ్కల్, అర్సాపల్లి, గుత్ప, పోచంపాడ్, శక్కర్​నగర్​లో పోలింగ్​ సెంటర్లను​ విజిట్ ​చేశారు. డ్రాఫ్ట్​ లిస్టులోని ఓటర్ల మార్పుచేర్పుల దరఖాస్తులను రిజిస్ట్రర్​లో నమోదు చేయాలన్నారు. ఆన్​లైన్, ఆఫ్​లైన్​ఆర్జీలను పరిశీలించారు. 

వలస ఓటర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండు ప్రాంతాల్లో ఓటరుగా ఉంటే, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. అనుమానాలుంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి క్లారిఫై చేసుకోవాలని సూచించారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు, అడిషనల్​కలెక్టర్ ​చిత్రామిశ్రా, నగర పాలక కమిషనర్​మంద మకరంద్​ పాల్గొన్నారు.

తప్పులు లేకుండా తుది జాబితా రూపొందించాలి

బోధన్​: ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు తుది జాబితాను రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్​ క్రిస్టినా జడ్​చోంగ్తూ సూచించారు. బుధవారం బోధన్​లోని శక్కర్​నగర్​లో మధుమలాంచ స్కూల్​ పరిధిలోని 88, 95 పోలింగ్​బూత్​లను ఆమె పరిశీలించారు. కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్న  దరఖాస్తులు, మార్పులు చేర్పుల అర్జీలు, వాటి నమోదు వివరాల రిజిస్టర్ ను పరిశీలించారు. పోలింగ్​ సమయంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. 

అనంతరం జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు మాట్లాడుతూ జిల్లాలోని బోగస్ ​ఓట్లపై వచ్చిన  ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో అధికారులతో సర్వేచేసి తొలగిస్తున్నట్లు చెప్పారు. వారి వెంట ఆర్డీవో రాజాగౌడ్, తహశీల్దార్ ​గంగాధర్, ఆర్ఐ అరుణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.