హైదరాబాద్ లో యువకుల ఓవరాక్షన్.. మా ఇంటి ముందు పటాకులు కాల్చొద్దన్న కుటుంబంపై దాడి..

హైదరాబాద్ లో యువకుల ఓవరాక్షన్.. మా ఇంటి ముందు పటాకులు కాల్చొద్దన్న కుటుంబంపై దాడి..

హైదరాబాద్ లో దీపావళి పటాకులు విషయంలో పలువురు యువకులు ఓవరాక్షన్ చేశారు. తమ ఇంటి ముందు పటాకులు కాల్చొద్దన్న కుటుంబంపై దాడికి యువకులు. సోమవారం ( అక్టోబర్ 21 ) హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అంబర్ పేట్ న్యూ వినాయకనగర్ లో క్రాకర్స్ ఇంటి ముందు కాల్చొద్దని చెప్పినందుకు కుటుంబంపైనే దాడికి దిగారు యువకులు.

అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులు ఇంటి ముందునా వాహనాలకు దగ్గరలో పటాకులు వేయడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది. ఇంటి ముందు పటాకులు కాల్చొద్దని వారించినందుకు మహిళపై విచక్షణారహితంగా దాడికి దిగారు యువకులు. ఈ దాడిలో మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ప్రతి ఏడాదిలాగే దీపావళి ఆనందంలో విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కంటి గాయాలతో ఆసుపత్రులకు క్యూ కట్టారు కొంతమంది జనం. దీపావళి సందర్భంగా పటాకులు పేల్చుతూ కొంతమంది ప్రమాదానికి గురయ్యారు. కంటి గాయాలతో మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు జనం.

సోమవారం ( అక్టోబర్ 20 ) రాత్రి నుంచి పటాకులు పేల్చుతూ గాయపడ్డ 47 మంది సరోజినీ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు సిబ్బంది. గాయపడ్డవారిలో 23 మందికి మేజర్ గాయాలయ్యాయని.. క్షతగాత్రుల్లో 18 చిన్నారులు ఉన్నారని తెలిపారు సిబ్బంది. క్రాకర్స్ వచ్చి కళ్ళల్లో పడటంతో గాయాలు అయ్యాయని తెలిపారు డాక్టర్లు.