న్యూయార్క్: కెరీర్‌లో రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌కు సిద్ధమయ్యాడు. ఆదివారం నుంచి జరిగే పోటీల్లో టైటిలే లక్ష్యంగా అతను బరిలోకి దిగుతున్నాడు. అయితే వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినర్ మోకాలి గాయంతో ఈ టోర్నీకి దూరం కావడం జొకోకు కలిసొచ్చే అంశం. అదే టైమ్‌లో మణికట్టు గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగుతున్న కార్లోస్ అల్కరాజ్ నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. వయసు పైబడటం, ఎండలో ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతుండటం జొకోకు ప్రతికూలంగా మారుతున్నాయి. విమెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక, జెస్సికా పెగులా, రిబకినా, కోకో గాఫ్‌లాంటి టాప్ ప్లేయర్లు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. గతంలో మాదిరిగా ఒకరిద్దరు సూపర్ డామినేషన్ చూపించే ప్లేయర్లు లేకపోవడంతో విమెన్స్ సింగిల్స్ టైటిల్ పోరు కూడా ఆసక్తికరంగా మారనుంది.
