‘పాలమూరు’ ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చిందా? : కేసీఆర్‌‌‌‌పై డీకే అరుణ ఫైర్

‘పాలమూరు’ ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చిందా? : కేసీఆర్‌‌‌‌పై డీకే అరుణ ఫైర్
  • ‘పాలమూరు’ ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చిందా?
  • కేసీఆర్‌‌‌‌పై డీకే అరుణ ఫైర్

హైదరాబాద్, వెలుగు :  ఫాం హౌస్‌‌ సీఎం కేసీఆర్‌‌‌‌కు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌ ఇప్పుడు గుర్తొచ్చిందా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. 8 ఏండ్ల కింద పనులు ప్రారంభించి, ఇప్పుడు ప్రాజెక్టును ప్రారంభించడంపై ఫైర్ అయ్యారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు.

‘‘మూడేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా. కుర్చీ వేసుకుని కూర్చుంట. కృష్ణా నది నీళ్లతో పాలమూరు ప్రజల కాళ్లు కడుగుతా.. అన్నడు. ఆయన కడిగేదేంది.. నేనే ఎన్నడో కృష్ణా జలాలతో పాలమూరు ప్రజల కాళ్లు కడిగిన. కేసీఆర్ ఒక జూటాకోర్. నేను చేసిన త్యాగాలు, పోరాటాల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌ ఘనత నాదే.. నువ్వేం చేశావ్ కేసీఆర్..?”అని అరుణ నిలదీశారు. భీమా, కోయిల్ సాగర్ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.