వలస కూలీల‌ను గేలిచేస్తూ.. బిస్కట్ ప్యాకెట్లు విసిరేసిన రైల్వే అధికారులు

వలస కూలీల‌ను గేలిచేస్తూ.. బిస్కట్ ప్యాకెట్లు విసిరేసిన రైల్వే అధికారులు

వలస కూలీల్ని గేలిచేస్తూ రైల్వే అధికారులు బిస్కట్ ప్యాకెట్లు విసిరేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరోనా వైరస్ మన దేశాన్ని పట్టిపీడిస్తుంది. రోజు రోజుకు కేసుల్ని పెంచేస్తూ  వికటాట్టహాసం చేస్తోంది. దీని దెబ్బకు అన్నీ రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేమని నిపుణులు చేతులెత్తేస్తున్నారు. ఈ విపత్తులో ఉద్యోగులు, వ్యాపారస్థుల పరిస్థితి ఎలా ఉన్నా.. వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. పనిచేసేందుకు పనిలేక.. తినేందుకు తిండిలేక.. ఊరెళ్లేందుకు బస్సులు లేక.. నడుచుకుంటూ తమ స్వగ్రామాలకు వెళుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లలో వలస కూలీలు తమ గమ్య స్థానాలకు వెళుతున్నారు. వెళుతూ వెళుతూ అవమానాల పాలవుతున్నారు.

ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ లక్నోకు వలస కూలీలు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో వెళుతున్నారు. అయితే ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ లో ఓ శ్రామిక్ ట్రైన్ ఆగింది. అదే సమయంలో ఫిరోజాబాద్ రైల్వే అధికారి డీకే దీక్షిత్ వలస కూలీలకు బిస్కట్లు విసిరేస్తూ గేలిచేశాడు

ట్రైన్ లో ప్రయాణిస్తున్న వలస కూలీలు తమకు బిస్కట్ ప్యాకెట్లు కావాలని అడగ్గా…నేను ఇప్పుడే ఒక బిస్కట్ ప్యాకెట్ ఇచ్చా…దాన్ని తినేసి మిగిలిన బిస్కట్లను షేర్ చేయండి అంటూ దుర్బషలాడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

దీక్షిత్ వంతపాడుతూ మరో ఉద్యోగి.. ఈరోజు దీక్షిత్ పుట్టిన రోజు అందుకే మీకు బిస్కట్లు ప్యాకెట్లు పంచి పెడుతున్నాడంటూ అవమానించాడు.

రైల్వే అధికారులు – వలస కూలీలలను దూర్బష లాడిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వలస కూలీల్ని అవమానించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.  విచారణలో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ షోకాజు నోటీసులు జారీ చేశారు.