ఎయిడ్స్ బాధితులకు అండగా ఉండాలి : గంట కవితా

 ఎయిడ్స్ బాధితులకు అండగా ఉండాలి : గంట కవితా

గద్వాల, వెలుగు: ఎయిడ్స్  బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ గంట కవితా దేవి కోరారు. శుక్రవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ వో ఆఫీసులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్  బాధితులు ధైర్యంగా ఉండాలన్నారు. ఎయిడ్స్  పట్ల ప్రతి ఒక్కరికీ అవేర్నెస్ కల్పించాలని కోరారు. ఎయిడ్స్  పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ వో శశికళ, ప్రోగ్రాం ఆఫీసర్ సిద్దప్ప, డాక్టర్  కిశోర్  పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ రూరల్: పాలమూరు యూనివర్సిటీలోని అకాడమిక్  బ్లాక్ లో ఎన్ఎస్ఎస్, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పీయూ రిజిస్ట్రార్  గిరిజ మంగతాయారు మాట్లాడుతూ ఎయిడ్స్ ను నిర్మూలించాలని కోరారు. డీఎంహెచ్​వో డాక్టర్  కృష్ణ, ఎన్ఎస్ఎస్  కో ఆర్డినేటర్  డాక్టర్  కె. ప్రవీణ, డా.భాస్కర్ నాయక్, డా. జరీన్ బేగం, శంకర్, డాక్టర్  జి. తిరుపతిరావు, ప్రోగ్రాం ఆఫీసర్స్  రవికుమార్, ఎస్ఎన్ అర్జున్ కుమార్, గాలన్న, ఈశ్వర్, జ్ఞానేశ్వర్, వెంకటేశ్, రామ్మోహన్  పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్/హన్వాడ: ఎయిడ్స్  బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జనరల్  హాస్పిట్​ సూపరింటెండెంట్ డాక్టర్  రాంకిషన్  సూచించారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా హాస్పిటల్​ నుంచి ర్యాలీ నిర్వహించారు. హెచ్ వోడీ డాక్టర్ లక్ష్మీ పద్మప్రియ, ఆర్ఎంవో సునీత పాల్గొన్నారు. హన్వాడ మండల కేంద్రంలో ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్  ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండల వైద్యాధికారి ప్రగతి, ఫౌండేషన్  రాష్ట్ర కో ఆర్డినేటర్  శాంసన్, రాములు, జె. వెంకటయ్య, రామానుజమ్మ, పద్మ, రామేశ్వరి, వసంత, యాదమ్మ పాల్గొన్నారు.