విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీఎల్ఎస్ఏ సెక్రటరీ వి.రజని

విద్యార్థులు  చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీఎల్ఎస్ఏ సెక్రటరీ వి.రజని

వనపర్తి టౌన్, వెలుగు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ వి.రజని  సూచించారు. సోమవారం వనపర్తి మండలం రేడియంట్  స్కూల్​లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకపోవడంతోనే క్షణికావేశంలో నేరాలు, గొడవలు, తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. 

బాల్య వివాహాల నిషేధం, బాల కార్మికుల నిర్మూలన, ఉచిత, నిర్బంధ విద్యా హక్కు, పోక్సో చట్టం, సైబర్  క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం15100 టోల్  ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని సూచించారు. అసిస్టెంట్  లీగల్  ఎయిడ్  డిఫెన్స్  కౌన్సిల్  రఘు, హెచ్ఎం తిరుమలేశ్​ పాల్గొన్నారు.