ఖిల్లాగణపురం, వెలుగు: 18 ఏండ్ల లోపు వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదవుతాయని డీఎల్ఎస్ఏ సెక్రటరీ రజిని హెచ్చరించారు. సోమవారం మండలంలోని దొంతికుంట తండా, మామిడిమాడ జడ్పీ హైస్కూల్, మోడల్ స్కూల్లో, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007, సైబర్ క్రైమ్, మోటార్ వాహనాల చట్టం, హిట్ అండ్ రన్ కేసులు, గృహ హింస నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్సై వెంకటేశ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి పాల్గొన్నారు.
