
కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్.. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 డిసెంబర్ 28 ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. విజయ్ కాంత్ వయస్సు 71 ఏళ్లు.. నాలుగేళ్ల క్రితం పక్షవాతం రావటంతో మంచానికే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు.
#BREAKING: Veteran Actor/DMDK Leader Thiru. #Vijayakanth passed away in Chennai this morning..
— Ramesh Bala (@rameshlaus) December 28, 2023
He was getting treated for Corona infection in a hospital.. He was ill for sometime..
He was 71..
Liked by everyone, he was known for his generosity..
TN will miss him.. RIP! ? pic.twitter.com/eA2XHG2Mnf
విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. తల్లిదండ్రులు కె.ఎన్. అళగర్‌స్వామి, ఆండాళ్ అజగర్‌స్వామి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును విజయకాంత్ గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిక్కుమ్ ఇలమై కాగా చివరి చిత్రం సగప్తం. 150కి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించారు. నిర్మాత, దర్శకుడిగా కూడా విజయకాంత్ రాణించారు. ఎక్కువగా దేశభక్తి, సందేశాత్మక సినిమాలపైనా ఆసక్తి చూపించేవారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు విజయకాంత్ . 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో ఓడిపోయారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.