
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆశా కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ ఆఫీస్లో గురువారం ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటి ఫీవర్ సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వర్షాలు, వరదల టైంలో గర్భిణుల విషయంలో అలర్ట్గా ఉండాలన్నారు.