డీఎంకే ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది

డీఎంకే ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది

మధురై: డీఎంకే ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. తమిళనాడులోని మధురైలో పర్యటిస్తున్న జేపీ నడ్డా.. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే నాయకులు తమిళనాడు ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన ఫైర్ అయ్యారు. అవినీతికి చట్టబద్ధత కల్పిస్తూ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డీఎంకే అనే పదానికి జేపీ నడ్డా కొత్త అర్థమిచ్చారు. D అంటే  dynasty (రాజవంశం), M అంటే Money swindling (డబ్బుతో మోసం చేయడం), K అంటే katta panchayat (దుర్మార్గపు ప్రభుత్వం) అని ఆరోపించారు.