చరిత్రను వక్రీకరించొద్దు

చరిత్రను వక్రీకరించొద్దు

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'హరిహర వీరమల్లు' చిత్రం చరిత్ర ఆధారంగా రూపుదిద్దినదిగా ప్రకటించబడింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. అయితే చిత్రంలోని చారిత్రక పరిణామాలు, పాత్రల స్థానం, సంఘటనల కాలగణన రూపంలో అసత్యాలు, అపోహలు 
స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఇవి కేవలం కళాత్మక స్వేచ్ఛ పరిమితుల్లో కాకుండా, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని విషప్రచారం చేసే ప్రయత్నంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో హరిహర వీరమల్లు అనే పాత్ర 14వ శతాబ్దానికి చెందినవాడిగా చూపించారు. 

1355లో మరణించాడట. 1591లో చార్మినార్ నిర్మాణం జరిగింది. 1618లో ఔరంగజేబు జననం. ఈ సమయాల మధ్య దాదాపు 250 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయినా సినిమాలో హరిహర వీరమల్లు ఔరంగజేబుతో పోరాడినట్లు చిత్రీకరించడం చరిత్రను తారుమారు చేయడమే కాదు, ఒక రాజకీయ దృష్టికోణాన్ని ఉద్దేశ్యపూర్వకంగా జొప్పించే ప్రయత్నంగా పరిగణించవచ్చు.


ఇటీవల కాలంలో భారతీయ సినిమా, ముఖ్యంగా హిందీ, దక్షిణాది చిత్రాల్లో, చారిత్రక నేపథ్యంలో మతవైషమ్యాన్ని వ్యాప్తిచేసే ధోరణి పెరిగింది. 

ఉదాహరణకు, ద కాశ్మీర్ ఫైల్స్ (2022): కాశ్మీరీ పండితుల వ్యధను ప్రధానాంశంగా చూపించిన ఈ చిత్రం, ముస్లిం సమూహాన్ని నిందిస్తూ నిర్మించబడింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు ఉధృతమయ్యాయి. 

ద కేరళ స్టోరీ (2023): వాస్తవాలను శోధించకుండా, లవ్ జిహాద్ అనే వాదనపై నిర్మించబడిన ఈ చిత్రం కూడా ఊహాజనితంగానేనిర్మించబడింది.తమిళ,తెలుగుచిత్రాల్లోనూ ముస్లింలను ఆక్రమణదారులుగా, వీరులకు ప్రాతినిధ్యంగా హిందువులను చూపించడం గమనించవచ్చు. ఇలాంటి చిత్రాల లక్ష్యం మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.


- యండి. ఉస్మాన్ ఖాన్  -