కాళ్లు మొక్కినా పొత్తు పెట్టుకోం : బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్

కాళ్లు మొక్కినా పొత్తు పెట్టుకోం :  బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్
  •   బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నరు
  •  17 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి..
  •  కాంగ్రెస్​ది గాలివాటం గెలుపు
  •  మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది

హైదరాబాద్: బీఆర్ఎస్ కాళ్లబేరానికి వచ్చినా తాము పొత్తు పెట్టుకోమని, ఆపార్టీ సిట్టింగ్​ఎంపీలు తమతో టచ్​లో ఉన్నారని బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్ అన్నారు. లోక్​సభ ఎలక్షన్లలో17 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్​ది గాలివాటం గెలుపు అని, మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని  ఆరోపించారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇండియా కూటమి పార్టీలతో ప్రజలు విసిగిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి కాంగ్రెస్ రాద్ధాంతం తప్ప చర్యలు లేవు. 

కొట్టినట్టు చేస్తం.. ఏడ్చినట్టు చేయండి అన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నరు. ఎన్నికల ముందు బొక్కింది అంతా కక్కిస్తాం అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఇప్పుడు వాళ్లతో లాలూచీ పడుతున్నారా? లిక్కర్​స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితపై విచారణ జరుగుతోంది. గత​ప్రభుత్వ అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్రం ఎందుకు లేఖ రాయడం లేదు? నేను పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా చెబుతున్నా.. తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా కాళ్లబేరానికి వచ్చినా మేం ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేస్తం’ అని లక్ష్మణ్ తెలిపారు.