పేదలకు ట్రీట్మెంట్ నిరాకరించొద్దు

పేదలకు ట్రీట్మెంట్ నిరాకరించొద్దు
  • ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు మంత్రి ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: పేద రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ సూచించారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని విన్ హాస్పిటల్లో జరిగిన ఇంటర్నేషనల్ వ్యాక్సినేషన్ డే సెలబ్రేషన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యం ఖర్చులు పేదలకు అందనంతగా పెరిగాయన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదల పట్ల కొంత సానుభూతితో వ్యవహరించి, తమపై ఉన్న చెడ్డ పేరును తొలగించుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ వంటి స్కీమ్ల కింద ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించొద్దని విజ్ఞప్తి చేశారు. వెయ్యి మంది పేదలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ వేయాలని, రోజూ రెండొందల మందికి ఉచితంగా అన్నదానం చేయాలని విన్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఈటల అభినందించారు. అన్నదానం కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.