పనిగంటలు చాలా తక్కువ ఉన్నదేశాలివే..

పనిగంటలు చాలా తక్కువ ఉన్నదేశాలివే..

మనది అభివృద్ధి చెందుతున్న దేశం.  ప్రజలు సగటున వారానికి నలభై నుంచి యాభై గంటలు పని చేస్తారు. ఆ లెక్కన ఏడాదిలో 2,500 గంటలు చేస్తున్నారన్న మాట. కానీ, అభివృద్ది చెందిన దేశాల్లో ఇన్నేసి పని గంటల అవసరం లేకుండా పోతోంది.  టైం అంటే టైంకి పని ఆపేస్తారు.

నెదర్లాండ్స్‌‌ : వారానికి ఇరవై ఏడున్నర గంటలు..  ఏడాదిలో 1,380 గంటలు మాత్రమే పని చేస్తారు.  అతితక్కువ పని గంటలు ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్‌‌ మొదటిది.  ఇక్కడ నిరుద్యోగం తక్కువ,  ఆదాయం ఎక్కువ.  వర్కింగ్‌‌ కమ్యూనిటీ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది.  ఎంప్లాయిమెంట్‌‌ సిస్టమ్‌‌ అంతా బ్యాలెన్సింగ్‌‌గా ఉండేలా చూసుకుంటుంది అక్కడి ప్రభుత్వం.  అంతేకాదు ప్రత్యేక చట్టాల ద్వారా జాబ్‌‌ సెక్యూరిటీ కూడా కల్పిస్తోంది.

జర్మనీ: ఈ దేశంలో వారానికి కేవలం 27 గంటలే  పని చేస్తారు. ఏడాదిలో అది 1,388 గంటలుగా ఉంటోంది. ఇంతకు ముందు ఈ పని గంటలు ఇంకా తక్కువ ఉండేవి.  కానీ, బెటర్‌‌ రిజల్ట్‌‌ కోసం ఈ మధ్యకాలంలోనే కొంచెం పెంచుకున్నారు.

నార్వే: ప్రపంచంలో లేబర్‌‌ చట్టాలన్ని  నిక్కచ్చిగా అమలు చేసే దేశం.  నెలలో ఉద్యోగులకు మూడు వారాలపాటే పని ఉంటుంది. పేరెంట్స్‌‌కి పని గంటలు ఇంకా తక్కువ. ఆడవాళ్ల కోసం పార్ట్ టైం జాబ్స్‌‌ని ఎక్కువ ఆఫర్‌‌ చేస్తుంటారు.  ఇక్కడ ఒక ఉద్యోగి ఏడాదిలో 1,400 గంటలు, వారానికి 28 గంటలు మాత్రమే పని చేస్తాడు.

డెన్మార్క్‌‌: వారంలో తక్కువ పని గంటలు ఉంటాయి.  వర్క్‌‌ అట్మాస్పియర్‌‌లో ఏమాత్రం ఒత్తిడి ఉండదు. టైమ్‌‌కి శాలరీ ఇస్తారు. పైగా వెకేషన్‌‌ పేమెంట్‌‌ కూడా ఉంటుంది. వారానికి 28 గంటల చొప్పున.. ఏడాదిలో
1, 400 గంటలు పని చేస్తారు.

ఫ్రాన్స్‌‌: ఏడాదిలో 1,489 గంటలు.. వారంలో 29 గంటలు పని చేస్తారిక్కడ.

స్లోవేనియా: ఈ దేశం 2010లో కొత్త లేబర్‌‌ చట్టాన్ని తీసుకొచ్చింది.  వర్కింగ్‌‌ క్లాస్‌‌ హక్కుల్ని ఇది పరిరక్షిస్తోంది. వారంలో 31 గంటలు, సంవత్సరం మొత్తంలో 1,547 గంటలు మాత్రమే పనిచేస్తారు.

బెల్జియం: 2005 నుంచి బెల్జియంలో వర్కింగ్ అవర్స్‌‌ మారాయి. వారంలో ముప్ఫై ఒకటిన్నర రోజులు. ఏడాదిలో 1,570 గంటలు పని చేస్తారు.

స్విట్జర్లాండ్: వారానికి 31.75 గంటలు, ఏడాదిలో 1,585 గంటలు పని చేస్తారు.

స్వీడన్‌‌: వారంలో 32 గంటలు..  ఏడాదిలో 1,607 గంటలు మాత్రమే వర్క్‌‌ చేస్తారు

ఆస్ట్రియా: వారంలో 32.5 గంటలు..  ఏడాదిలో 1,607 గంటలు పని చేస్తారు.