పాకిస్థాన్ లో తులం బంగారం ఎంతంటే?

పాకిస్థాన్ లో తులం బంగారం ఎంతంటే?

ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ అర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.  ఎన్నడూ లేని విధంగా దివాలా అంచున నిలిచింది. వరదలతో పంటలు నష్టపోవడం, విదేశీ మారక నిల్వలు అడుగంటడం, రష్యా-ఉక్రెయిన్  యుద్ధంతో ధరలు పెరగడం, ఇప్పటికే చెల్లించాల్సిన అప్పుల్ని చెల్లించకపోవడంతో ఏ దేశమూ పాక్ ను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు.  ప్రస్తుతం అక్కడ ధరలు బగ్గుమంటున్నాయి. కనీసం  నిత్యావసర వస్తువులను కూడా కొనుక్కోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు.

పాక్ లో డీజిల్ ధర రూ. 280 రూపాయలకు చేరుకుంది.  ఇక బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2.06 లక్షల రూపాయలు పలుకుతోంది. అటు  పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ గురువారం కీలక వడ్డీ రేటును 300 బేసిస్ పాయింట్లు పెంచింది.  దాంతో రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరుకుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ అప్పు కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. కాగా పాకిస్థాన్  లో ఫిబ్రవరిలో నెలవారీ ద్రవ్యోల్బణం 31.6%కి పెరిగింది.