వెన్ను నొప్పితో బాధపడుతున్నారా?

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా?

యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ (AS) అనేది కీళ్లనొప్పుల వ్యాధి. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను (దిగువ వెనుక) ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ప్రభావం (ప్రధానంగా ఆడవాళ్లలో నెలసరి తర్వాత) వెన్నెముక చుట్టూ, మెడ నుంచి దిగువ వెనుక వరకు పిరుదుల్లో నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వెన్నెముక ఎముకల మంటకు (యాంకైలోసెస్) దారితీస్తుంది. ఫలితంగా  వెన్నెముక  కదల్చలేని స్థితికి వస్తుంది. వెన్నెముకతోపాటు, భుజాల్లో వెచ్చదనం, మడమలు, పక్కటెముకలు, చేతులు, అరికాళ్లు  చిన్నకీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, బిగించుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు కళ్ళలో (ఇరిటిస్, యువెటిస్)  ప్రభావం కూడా ఉంటుంది. అరుదుగా ఊపిరితిత్తులు, గుండె కూడాఎఫెక్ట్​ అవుతాయి . కొందరు రోగుల్లో ఈ వ్యాధి తీవ్రత పలు రకాలుగా ఉంటుంది.

“యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ సాధారణంగా యువకులపై (20- నుంచి 35 ఏళ్లు) ప్రభావం చూపిస్తుంది. వ్యాధి ధోరణి  జన్యుపరంగా వారసత్వంగా వస్తుంది. ఈ వ్యాధి ఉన్న చాలా మంది (90 శాతం) రోగుల రక్తంలో HLA-B27 జన్యువును కనుక్కోవచ్చు. రోగ నిర్ధారణకు ఆధారాలు వెన్నెముక, ఇ.ఎస్‌‌.ఆర్, సి.ఆర్‌‌.పి, హెచ్‌‌.ఎల్‌‌.ఏ-బి 27 ఎక్స్‌‌రే / ఎం.ఆర్‌‌.ఐ అసాధారణాల ద్వారా సూచించాయి” అని స్టార్ హాస్పిటల్‌‌ కన్సల్టింగ్ రుమటాలజిస్ట్
డాక్టర్ శ్రవణ్​ కుమార్ అప్పాని, అన్నారు.

రుమటాలజిస్టులు, సూపర్-స్పెషలిస్టులు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న రోగులకు నిర్ధారణ చికిత్సలు చేస్తారు. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ సరైన చికిత్సలో మంటను తగ్గించే, రోగనిరోధక శక్తిని పెంచే మందులు ఉంటాయి. ఫిజియోథెరపీ వల్ల శారీరక వ్యాయామం, వెన్నెముక కదలికను మెరుగుపర్చడంలో సాయపడుతుంది. దీర్ఘకాలిక వెన్నునొప్పి సమస్య ఉంటే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్‌‌ను తొలగించుకోవడానికి  రుమటాలజిస్టును సంప్రదించాలి. అలా చేయడం వల్ల ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స, వ్యాధిని నియంత్రించడంలో సాయపడుతుంది. వ్యాధి నివారణకూ తోడ్పడుతుంది.