అవార్డులు.. అంటేనే ‘అర్హత’ అని అర్ధం. ఏదైనా ఒక సినిమాలో నటించే నటి నటులు.. తమ పాత్రల్లో ఎలాంటి అసాధారణమైన నటనను కనబరిచారో గుర్తించి సత్కరించేదే ‘అవార్డు’. కానీ, ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ.. ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా.. అవార్డులకు అర్ధాలు మారుతున్నాయి. తమ తమ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని అవార్డులు వరిస్తున్నాయని తరుచూ వింటూ వస్తున్నాం. ఇంకొన్ని సార్లు ఎంపిక విషయంలో కొంతమంది పర్సనల్గా జోక్యం చేసుకుని సెలెక్ట్ చేస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వివాదమే కేరళ అవార్డుల విషయంలో జరిగిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
లేటెస్ట్గా 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం (2025 నవంబర్ 3న) ఈ అవార్డులను ప్రకటించారు. కేరళ ఫిల్మ్ అవార్డుల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు.
హారర్ థ్రిల్లర్ మూవీ ‘భ్రమయుగం’లో అతడు పోషించిన కోడుమోన్ పోట్టి పాత్రకుగాను మమ్ముట్టికి మరోసారి ఈ అగ్ర పురస్కారం వరించింది. మంజుమ్మెల్ బాయ్స్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ అవార్డులను ప్రకటించిన అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్‌గా మారాయి.
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల చైర్‌పర్సన్ మరియు నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..‘‘మమ్ముట్టికి జాతీయ గుర్తింపు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ అవార్డుల ప్రక్రియ యొక్క సమగ్రతను ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డులలో సమగ్రమైన న్యాయం జరగడం లేదు. జాతీయ అవార్డులు రాజీ పడ్డాయని చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. జ్యూరీలో అలాంటి విధానాలు ఉన్నప్పుడు, రాజీ పడుతున్నప్పుడు మమ్ముట్టి లాంటి గొప్ప వ్యక్తులకు ఇలాంటి అవార్డులు అవసరం లేదు’’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
►ALSO READ | ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ డ్రాగన్ డబుల్ ట్రీట్..
 
అలాగే, ఈ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. కమిటీ వారు నాకు ఫోన్ చేసి కేరళకు చెందినవారు కాకుండా బయటి వ్యక్తులు, నటనలో అనుభవజ్ఞుడైన వారు అవసరమని, జ్యూరీ ఛైర్మన్‌గా ఉండాలని కోరారు. అలా వెంటనే అంగీకరించాను. కమిటీ సభ్యులు కూడా అవార్డుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకోమని చెప్పారు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామన్నారు. మీరు నిర్ణయం తీసుకోవడానికి మేము అనుమతిస్తాము అన్నారు. కానీ, అలా జరగలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. కొందరికి మాత్రమే అవార్డులు వస్తున్నాయని ప్రకాష్ రాజ్ తన వైఖరిని వివరించారు.
ఇపుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇకపోతే, మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక సార్లు ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా మమ్ముట్టి రికార్డు సృష్టించారు.
అవార్డుల జాబితా:
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా అవార్డుల ప్యానెల్‌లో ఈసారి సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి అవార్డులతో పాటుగా పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
ఉత్తమ చిత్రం- మంజుమ్మెల్ బాయ్స్
ఉత్తమ ద్వితీయ చిత్రం - ఫెమినిచి ఫాతిమా
ఉత్తమ నటుడు- మమ్ముట్టి (భ్రమయుగం)
ఉత్తమ నటి- (షమ్లా హంజా)
ఉత్తమ సహాయ నటుడు: సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ సహాయ నటి: లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)
ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ మెన్షన్- టొవినో థామస్ (ARM)
ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ మెన్షన్- దర్శన రాజేంద్రన్- ప్యారడైస్
ఉత్తమ తొలి దర్శకుడు: ఫాజిల్ మహ్మద్- (ఫెమినిచి ఫాతిమా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (DOP): షైజు ఖలీద్
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్): చిదంబరం
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అజయన్ చాలస్సేరి
ఉత్తమ సౌండ్ డిజైన్: షిబిన్ మెల్విన్, అభిషేక్ నాయర్
ఉత్తమ సంగీత దర్శకుడు: సుషిన్ శ్యామ్- బౌగేన్విల్లా
ఉత్తమ లిరిసిస్ట్: వేదన్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ప్రేమలు
బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (సయనోరా ఫిలిప్, భాసి వైకోమ్)- బరోజ్
