- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ వర్షిణి
 
గద్వాల, వెలుగు: అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని ఏబీపీ జిల్లా ఆఫీసర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ వర్షిణి కోరారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌కు జిల్లాలోని గట్టు మండలం ఎంపిక కాగా, సోమవారం ఆమె పర్యటించారు. గట్టు మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ మీటింగ్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పోషణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం తదితర కీలకరంగాల్లో మార్పు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. ఏబీపీలోని 39 అంశాలు పనితీరుకు సూచికలుగా ఉంటాయని చెప్పారు. అనంతరం నల్లగట్టు తండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఇన్చార్జి డీఈవో విజయలక్ష్మి, చేనేత జౌళి శాఖ అధికారి గోవిందయ్య, తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీవో చెన్నయ్య పాల్గొన్నారు.
