హార్ట్​ ఎటాక్​తో డాక్టర్ మృతి

హార్ట్​ ఎటాక్​తో డాక్టర్ మృతి
  •      శామీర్​పేట రిసార్ట్స్​లో కుప్పకూలిన భరత్​రెడ్డి 
  •     మృతుడు మాజీ ఎమ్మెల్యే చింతల అన్న కొడుకు

కల్వకుర్తి, వెలుగు : నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తి పట్టణంలో మూడేండ్లుగా ప్రాక్టీస్  చేస్తున్న రేడియాలజిస్ట్ చింతల భరత్ రెడ్డి(36) గుండెపోటుతో చనిపోయాడు. ఆయన భార్య కాయితి చేతనరెడ్డి కల్వకుర్తిలో డెర్మటాలజిస్ట్ గా పని చేస్తున్నారు. వీరికి ఐదేండ్లు, ఏడాది వయసున్న ఇద్దరు బిడ్డలున్నారు. బుధవారం సాయంత్రం శామీర్ పేట్ లోని రిసార్ట్ లో జరిగిన ఫంక్షన్ లో పాల్గొన్న భరత్ రెడ్డి అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. రిసార్ట్  సిబ్బంది మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. మృతుడు భరత్ రెడ్డి బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్న కొడుకు.