Health Tips: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తినండి... వేసవిలో కడుపు ఉబ్బరం సమస్య ఉండదు..

Health Tips: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తినండి... వేసవిలో కడుపు ఉబ్బరం సమస్య ఉండదు..

ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం అవుతున్న క్రమంలో మరికొన్ని రోజులు ఎండ వేడి భరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఎండ వేడి వల్ల వడదెబ్బ లాంటి సమస్యలే కాకుండా కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీటి వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే... ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్ చెప్పవచ్చని అంటున్నారు డాక్టర్లు. ఉదయాన్నే ప్రో బయోటిక్స్ తీసుకోవడం ద్వారా గట్ హెల్త్ ని కాపాడుకోవచ్చని అంటున్నారు డాక్టర్లు. ప్రతి రోజూ ఉదయాన్నే ప్రో బయోటిక్స్ తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయని అంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ప్రోబయోటిక్స్ ఇవే:

పెరుగు:

గట్ హెల్త్ ని మెరుగుపరచడంలో పెరుగు ముందుంటుంది. ఇందులో ఉండే బాక్టీరియా కడుపును తేలికగా ఉంచి కడుపు ఉబ్బరం సమస్య రాకుండా ఉంచడంలో తోడ్పడుతుంది.

మజ్జిగ:

మజ్జిగ లాంటి ఫర్మెంటేడ్ డ్రింక్స్ వేసవిలో కావాల్సిన చల్లదనాన్ని అందిస్తాయి. అంతే కాకుండా.. సరైన సమయంలో తగిన మోతాదులో మజ్జిగ తీసుకుంటే అసిడిటీ, ఉబ్బరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. భోజనం తర్వాత మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు. 

పులియబెట్టిన బియ్యం

పులియబెట్టిన బియ్యంలో సాంప్రదాయ ప్రోబయోటిక్స్ ఉంటాయని, ఇది వేసవి వేడిలో పేగులను చల్లబరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పుడు, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయని అనిపించినప్పుడు పులియబెట్టిన అన్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఫర్మెంటేడ్  క్యారెట్ డ్రింక్ 

పులియబెట్టిన క్యారెట్ డ్రింక్ బలమైన ప్రోబయోటిక్స్‌తో సమృద్ధిగా ఉండే ఒక ట్రెడిషనల్ డ్రింక్. ఆధునిక డైజెస్టివ్ డ్రింక్స్ తో పోలిస్తే.. ఇది ఇండియన్స్ డైజెస్టివ్ సిస్టంకి అనువుగా ఉంటుందని, మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు .

ఇంట్లో తయారుచేసిన ఫర్మెంటేడ్ పికిల్డ్ వెజిటల్స్:

మసాలాలు, కొద్దిపాటి నూనెలతో తయారు చేసే ఫర్మెంటేడ్ పికిల్డ్ వెజిటబుల్స్ జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని సరైన పద్దతిలో తీసుకుంటే గట్ హెల్త్ మెరుగుపడుతుందని... వేసవిలో ఉబ్బరం లాంటి సమస్యలు రావని చెబుతున్నారు నిపుణులు.

వీరు ఖాళీ కడుపుతో ప్రోబయోటిక్స్ తీసుకోకూడదు:

సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఉదయాన్నే ప్రోబయోటిక్స్ తీసుకున్నప్పుడు వారి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్లతో బాధపడేవారు ప్రోబయోటిక్స్ వాడకం విషయంలో జాగ్రత్త వహించాలి.