వెంటిలేటర్స్ ఉన్న వాడుతలేరు

V6 Velugu Posted on Apr 12, 2020

న్యూయార్క్ : కరోనా వైరస్ తీవ్రమైన పేషెంట్లకు వెంటిలేటర్స్ పై ట్రీట్ చేస్తే ప్రయోజనం ఉంటుందా? శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్ అందిస్తే సరిపోతుందా ? వెంటిలేటర్స్ కావాల్సినన్నీ ఉంటే కరోనా తో చనిపోయే వారి సంఖ్య చాలా వరకు తగ్గుతుందా ? ఈ ప్రశ్నలకు చాలా మంది ప్రముఖ డాక్టర్ల వద్దా కూడా సమాధానం దొరకటం లేదు. కరోనా వైరస్ పెరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు వెంటిలేటర్ల కొరత తీర్చుకునే పనిలో పడ్డాయి. అవి ఉంటే చాలు కరోనా డెత్ రేటు చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న పేషెంట్లకు వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ అందించినా పెద్దగా ఫలితం ఉండదని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే చాలా మంది డాక్టర్లు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించటం లేదు. కొంతమంది డాక్టర్లు పేషెంట్లకు ఈ మెషీన్ ద్వారా వైద్యం అందించటమే మరింత హార్మ్ ఫుల్ గా మారుతుందని వర్రీ అవుతున్నారు. ఇప్పటివరకు కరోనాకు ఓ నిర్దిష్టమైన ట్రీట్ మెంట్ అంటూ ఏమీ లేదు. దీంతో చాలా మంది డాక్టర్లు కరోనా ట్రీట్ మెంట్ లో చనిపోయిన వారి డేటాను అనుసరించి వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ పేషెంట్లకు ప్రయోజనంగా ఉండదని అంచనా వేస్తున్నారు. సాధారణంగానే వెంటిలేటర్లపై ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లలో సగానికి పైగా చనిపోతారని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కరోనా విషయానికి వస్తే అమెరికాలో వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ తీసుకున్న వారిలో 80 శాతం మంది మరణించారు. చైనాలోని వుహాన్ లోనూ వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ పొందిన వారిలో 86 శాతం మరణించారు. 10 నుంచి 15 రోజుల పాటు వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ఇచ్చిన కరోనా పేషెంట్లు బతకటం లేదు. వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ పొందిన వారిలోనే డెత్ రేటు ఎక్కువగా ఉంటుందని అమెరికన్ లంగ్ అసోసియేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అల్బర్ట్ రిజ్జో చెప్పారు.
వెంటిలేటర్లే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ ఇస్తున్నా చాలా మంది చనిపోవటంపై మెడికల్ ఎక్స్ ఫర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పేషెంట్లకు అంతకు ముందు ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉండవవచ్చని అంచనా వేస్తున్నారు. చాలా మంది హెల్త్ ప్రొఫెషనల్స్ సైతం వెంటిలేటర్స్ పై ఎక్కువ టైమ్ చికిత్స ఇవ్వటం పేషెంట్ల కండిషన్ ను మరింత దిగజారుస్తుందని ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ ఒత్తిడితో లంగ్స్ లోకి ఆక్సిజన్ ను పంపించటం ద్వారా ఊపిరితిత్తులు పాడవుతాయని అమెరికాలో లంగ్ ఎక్స్ ఫర్ట్ డాక్టర్ ఎడ్డీ ఫ్యాన్ తెలిపారు. ” గత కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్ చేసి కనుగొన్న గొప్ప విషయం ఏమిటంటే వెంటిలేటర్లపై ట్రీట్ మెంట్ అనేది ఊపిరితిత్తులకు హాని చేయటమే. అందుకు దీన్ని అతి జాగ్రత్తగా వాడాలి ” అని డాక్టర్ ఎడ్డీ చెప్పారు.
అయోమయంలో డాక్టర్లు
కరోనా ట్రీట్ మెంట్ లో వెంటిలేటర్ల వినియోగంపై చాలా మంది డాక్టర్లు అయోమయంలోనే ఉన్నారు. కొంతమంది వీటి వల్ల ప్రయోజనం లేదన్న కారణంతో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను కూడా వాడటం లేదు. మరికొంత డాక్టర్లు మాత్రం కరోనా తీవ్రత పెరిగిన పేషెంట్లను ఎక్కు వ టైమ్ వెంటిలేటర్లపైనే ఉంచుతున్నారు. కరోనా తీవ్రత పెరిగితే వెంటిలేటర్లు ఉన్న ఉపయోగం లేదన్నది ఇటీవల డెత్ రేట్ ను పరిశీలిస్తే అర్థమవుతోంది. దీంతో ఈ మహమ్మరికి వ్యాక్సిన్ నే సరైన విరుగడని ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు.

Tagged doctors, coronavirus, ventilators, Death rate.

Latest Videos

Subscribe Now

More News