మూడున్నర గంటల్లో 50 కిలోల ట్యూమర్ తొలగింపు

మూడున్నర గంటల్లో 50 కిలోల ట్యూమర్ తొలగింపు

మహిళ అండాశయంలో ఉన్న 50 కిలోల ట్యూమర్ ను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ డాక్టర్లు సక్సెస్ ఫుల్ గా తొలగించారు. మహిళ శరీరం బరువులో సగం బరువున్న ట్యూమర్ ను రిమూవ్  చేసేందుకు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు. ప్రపంచంలోనే ఇంత బరువైన ట్యూమర్ను తొలగించడం చాలా అరదని డాక్టర్లు చెప్పారు. ‘ఢిల్లీకి చెందిన 52 ఏళ్ల మహిళ కొన్ని నెలలుగా బరువు పెరిగారు. ఆమె శరీర బరువు 106 కిలోలైంది. ఈ మధ్య ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది మొదలైంది. కడపు నొప్పితో బాధపడేది. నడిచినప్పుడు, పడుకున్నప్పుడు తరుచూ ఇబ్బంది పడేది. వేగంగా బరువు పెరగడం, బాడీలో కాంప్లి కేషన్స్ పెరగడంతో కుటుంబసభ్యులు మమ్మల్ని సంప్రదించారు. అండాశయంలో ట్యూమర్ ఉందని గుర్తించాం. ట్యూమర్ వల్ల పేగుల్లోప్రెషర్ పెరిగి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు తేలింది. దీనికి తోడు బ్లడ్ హిహిమోగ్లోబిన్ లెవెల్ కూడా ఆరుకు పడిపోయింది’ అని అపోలో డాక్టర్ అరుణ్ ప్రసాద్ చెప్పారు.