
శంషాబాద్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య అమరత్వం మరువలేమని, ఆయన అమరత్వం పోరాటానికి చైతన్యం నింపిందని కురుమ సంఘం అధ్యక్షుడు మామిడిపల్లి జంగయ్య అన్నారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ చౌరస్తా వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కర్రె మధుసూదన్ కురుమ,శీలం కృష్ణ, కడల అనిల్ కుమార్, తుల్జా విజయ్ కుమార్, బుడుగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.