బబుల్ గమ్.. కడుపులో అరగటానికి ఏడేళ్లు పడుతుందా.. నిజమా

బబుల్ గమ్.. కడుపులో అరగటానికి ఏడేళ్లు పడుతుందా.. నిజమా

కొన్ని సందర్భాల్లో చూయింగ్‌ గమ్‌ను(బబుల్ గమ్) పొరపాటున మింగేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. మరి ఈ చూయింగ్ గమ్ మింగడం వలన ఏమైనా దుష్ప్రభావం ఉంటుందా? శరీర భాగాలకు ఏమైనా హామీ కలుగుతుందా? అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. మరి చూయింగ్ గమ్ మింగడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.....

చూయింగ్ గమ్ (బబుల్ గమ్) ను మింగితే అది జీర్ణం కావడానికి ఏడేళ్లు పడుతుందనే ప్రచారంపై యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రఖ్యాత యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ సైమన్ ట్రావిస్  క్లారిటీ ఇచ్చారు. కడుపులో గమ్‌ ప్రేగులకు అంటుకోదని, ఏళ్లపాటు కడుపులో ఉండే అవకాశం లేదని చెప్పారు. గమ్ కూడా మలంలో విసర్జించబడుతుందని ఆయన చెప్పారు. గమ్ జీర్ణం కానప్పటికీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీయదని, ఇలాంటి కృత్రిమ స్వీటెనర్లు మింగితే వికారం, విరేచనాలు, తలనొప్పికి కారణమవుతాయని తెలిపారు. అయితే  చూయింగ్ గమ్‌ ను మింగడం హానికరం కాదని, ఇలాంటి వాటిని మింగొద్దని పిల్లలకు నేర్పాలని పేరెంట్స్ కు సూచించారు

పిల్లలు, పెద్దలు అందరూ చూయింగ్‌ గమ్‌(బబుల్ గమ్) ను నములుతుంటారు. కొందరు దవడకు వ్యాయామం కోసం, దంతాల బలం, శుభ్రం కోసం, దుర్వాసన పోగొట్టుకోవడం కోసం తింటే.. మరికొందరు టైమ్ పాస్ కోసం తింటారు. చూయింగ్ గమ్ మింగడం వలన అది కడుపులోకి పోయిన తరువాత పేగుల్లో అడ్డంకిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూయింగ్‌ గమ్ దాదాపు 7 సంవత్సరాల పాటు కడుపులో అలాగే ఉంటుందని ఒక టాక్. అయితే, ఈ వాదనలో వాస్తవం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చూయింగ్ గమ్ అస్సలు జీర్ణం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది కరుగని పదార్థంతో తయారు చేస్తారట. అయితే, ఒకవేళ దీనిని మింగితే కొన్ని గంటలలో లేదా కొన్ని రోజుల తర్వాతైనా దానంతటదే మలం ద్వారా బయటకు వస్తుందని చెబుతున్నారు. చూయింగ్ గమ్‌ను ఎప్పుడూ పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. పదే పదే అనుకోకుండా మింగడం వలన అది మీ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

చూయింగ్ గమ్ (బబుల్ గమ్) మింగడం వల్ల హాని జరగదనిఇండియానా యూనివర్శిటీలోని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ,  పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరోన్ కారోల్ ధృవీకరించారు.చూయింగ్ గమ్ సాధారణ స్థితిలో శరీరం నుండి బయటకు రావడానికి ఒకటి నుండి రెండు రోజులు పడుతుంది. రబ్బర్ మాదిరిగా ఉండటం వల్ల శరీరం నుంచి బయటకు వెళ్లడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. శరీరం నుంచి ఒక రోజులో చూయింగ్ గమ్‌ను బయటకు వెళ్లకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సివుంటుంది. చూయింగ్ గమ్ శరీరం నుండి బయటకు రాకపోతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వికారం, నెర్వస్‌నెస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మందిలో అలెర్జీలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా పిల్లల విసర్జన అవయవాలు పెద్దలతో పోలిస్తే అంతగా అభివృద్ధి చెందవు. అందుకే చూయింగ్ గమ్ వారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. చూయింగ్ గమ్ నమిలేటప్పుడు పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి..