అయ్యో పాపం: 10 రోజుల్లో పెళ్లి.. కుక్క ఎంత పని చేసింది..

అయ్యో పాపం:  10 రోజుల్లో పెళ్లి..   కుక్క ఎంత పని చేసింది..

పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ వ్యక్తిపై జాలి చూపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే ..

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. అలాంటి ఘట్టాన్ని గుర్తుండిపోయేలా మలుచుకోవాలని అందరూ భావిస్తారు. అందుకే కొందరు ఖర్చెంతైనా పర్లేదని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు.తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే  అమెరికాకు చెందిన ఓ జంట కూడా తమ పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని డిసైడైంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే పెళ్లికి 15 రోజుల ముందు వరుడి పెంపుడు కుక్క చేసిన పని వాళ్లను ప్రాబ్లెంలో పడేసింది. 

షాకిచ్చిన పెంపుడు కుక్క 

అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలి, మగ్దా మజ్రీకి ఇటీవలే పెళ్లి కుదిరింది. ఆగస్టు 31న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు.  పెళ్లి బృందం ఇటలీ బయలుదేరేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.  డొనాటో, మగ్దాలు ఆగస్టు 17 న పెళ్లికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సిటీ హాల్కు  వెళ్లారు.  ఎంతో ఆనందంతో అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చిన వారికి డొనాటోకు పెంపుడు కుక్క చిక్కీ షాకిచ్చింది.

పాస్పోర్ట్ను నమిలేసి ...

ఇంటికి చేరుకున్న పెళ్లి కొడుకు డొనాటో ఫ్రాట్టరోలీకి చిక్కీ (పెంపుడు కుక్క) తన పాస్పోర్ట్ నములుతూ కనిపించంది. . ఇది చూడగానే డొనాటోకు గుండె ఆగినంత పనైయ్యింది . వెంటనే ఆ పాస్ట్ పోర్ట్ ను లాక్కొని చూడగా కుక్క అప్పటికే సగం పేజీను పరపరా నమిలేసింది. ఇటలీ బయలుదేరేందుకు వారం రోజుల ముందు పెంపుడు కుక్క చేసిన పనికి డొనాటో తలపట్టుకున్నాడు. బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహాతో స్థానిక అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతని బాధ అర్థం చేసుకున్న అధికారులు వీలైనంత తొందరగా కొత్త పాస్ పోర్ట్ జారీ చేసే ప్రయత్నం చేస్తామని భరోసా ఇవ్వడంతో డొనాటో ఊపిరిపీల్చుకున్నాడు. పెళ్లి బృందం శుక్రవారం ( ఆగస్టు 25)  ఇటలీకి బయలుదేరనుంది. ఆ లోపు కొత్త పాస్ పోర్ట్ వస్తే వారితో కలిసి ఫ్లైట్ ఎక్కుతానని, లేనిపక్షంలో ఇటలీ నుంచి తిరిగొచ్చిన వారికి స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తానని పెళ్లికొడుకు అంటున్నాడు. . అయితే తెలివిలేని మూగజీవి చేసిన తప్పుకు డొనాటో పెళ్లి కోరిక తీరకుండా పోకూడదని అతనికి వెంటనే పాస్ పోర్టు రావాలని ఈ వార్త తెలిసిన వారు కోరుకుంటున్నారు.