దారుణం : గర్భవతిని చంపేసిన కుక్కలు

దారుణం : గర్భవతిని చంపేసిన కుక్కలు

పెంపుడు కుక్కతో వాకింగ్‌కి వెళ్లిన గర్భవతిని కుక్కలు కరిచి చంపిన ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ప్యారిస్‌కు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్లర్స్-కొటరెట్స్ పట్టణానికి సమీపంలో ఉన్న అడవిలో ఈ ఘటన జరిగింది. గర్భవతి అయిన 29 ఏళ్ల స్థానిక మహిళ తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లింది. అక్కడ కొన్ని కుక్కలు ఆమెపై దాడి చేసి చేతులను, తలను కరచి చంపేశాయి. ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం గుర్తించారు. కుక్కలు కరవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతోనే ఆమె మరణించినట్లు ప్రాసిక్యూటర్ ఫ్రెడరిక్ తెలిపాడు. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే 93 కుక్కలపై పరీక్షలు జరిగాయని.. అంతేకాకుండా ఆ మహిళకు చెందిన పెంపుడు కుక్కలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ ఫ్రెడరిక్ తెలిపాడు. కుక్కలు చేసిన ఈ నరహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక పత్రిక.. కుక్కలు, జింకలను వేటాడే క్రమంలో మహిళపై దాడిచేశాయని పేర్కొంది.