Good Health : నడుము నొప్పుల ఉపశమనం.. ఈ యోగ ఆసనాలు

Good Health : నడుము నొప్పుల ఉపశమనం.. ఈ యోగ ఆసనాలు

ఏ వ్యాయామం చేసినా... ఆరోగ్యంగా ఉండేందుకే. వాటిని ఒక క్రమ పద్ధతిలో చేస్తే శరీర అవయవాలకు ఫ్లెక్సిబిలిటీ, తీరైన శరీరాకృతి వస్తుంది. ఈ బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు చేయడం వల్ల నడుము భాగం దృఢంగా తయారవుతుంది. కండరాల బలం పెరుగుతుంది.

స్ట్రిచ్చింగ్ బ్యాక్ (అడ్వాన్స్ డ్ యోగా) 

ముందుగా నేల మీద కూర్చోవాలి. ఇప్పుడు ఎడమ కాలి మోకాలిని మడిచి శరీరాన్ని మొత్తం ఆ కాలిపై ఆన్చాలి. తర్వాత కుడి కాలిని వెనక్కి చాపాలి. చేతులు రెండూ వెనక్కి పెట్టి నేలకు అన్ని మెడను ఎడమ వైపుకు తిప్పాలి. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ రెండు నిమిషాలకి ఒకసారి కాళ్లను మార్పుతూ ఈ వ్యాయామాన్ని పదినిమిషాల పాటు చెయ్యాలి. దీనివల్ల వెన్నెముక భాగంలో ఉండే కండరాలు, కాళ్ల కండరాలు బలపడతాయి.

ద్విపాద పిస్తాసన

నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను మోకాలి వరకూ పైకి లేపాలి. రెండు చేతులతో కింద నుంచి కాళ్ల మడమలను గట్టిగా పట్టుకుని నడుము భాగాన్ని పైకి లేపాలి. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ నడుము పైకి ఎంతవరకూ లేపగలిగితే అంతవరకూ లేపాలి. ఈ వ్యాయామం వల్ల శురంలోని అన్ని కండరాలు బలంగా తయారవుతాయి.

సేజ్ పోజ్(భరద్వాజాసనం)

నేలమీద కూర్చోవాలి. అప్పుడు కుడికాలుని ముందుకు చాపి మోకాలిని మడవాలి. తర్వాత ఎడమ కాలిని వెనకకు పెట్టి మోకాలు మడవాలి. శరీరాన్ని నిటారుగా ఉంచి నడుమును కుడివైపు తిప్పాలి. అలా కుడి, ఎడమ కాళ్లను మార్చి మార్చి ఐదు నిమిషాల పాటు చెయ్యాలి.. ఈ వ్యాయామం వల్ల నడుము భాగానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.

కోర్ స్ట్రెచ్

నేలపై బోర్లా పడుకోవాలి. తర్వాత రెండు చేతులను నేలకు అన్ని మెడను పైకి ఎత్తుతూ మెల్లిగా మోకాలి వరకూ శరీరాన్ని పైకి లేపాలి. అలా చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఐదు నిమిషాల పాటు ఉండి తిరిగి యథాస్థితికి రావాలి.. ఈ వ్యాయామం వల్ల పొట్ట దగ్గర కండరాలు బలంగా తయారవుతాయి. మెడ పక్క భాగాలు గట్టి పడతాయి.

ALSO READ :- బీజేపీ మూడో జాబితా..చెన్నై సౌత్ నుంచి తమిళి సై