
రెండు జంటలున్న ఈ ఫొటోకు ఒక స్పెషాలిటీ ఉంది. మొదటి జంట అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ ది. ట్రంప్ వయసు 73 ఏళ్లు కాగా ఆయన భార్య మెలానియా వయసు 49 ఏళ్లు. అంటే మెలానియా కంటే ట్రంప్ 24 ఏళ్ల పెద్ద. మోడల్ గా ఉన్న మెలానియాను 2005 లో ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. రెండో జంట ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ ది. ఆయన వయసు 42 ఏళ్లు. మెక్రాన్ భార్య బ్రిగిట్ వయసు 66 ఏళ్లు. అంటే భార్య కంటే మెక్రాన్ 24 ఏళ్ల చిన్నవాడు. 1993 లో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పటి కి బ్రిగిట్ వయసు 40 ఏళ్లు. స్కూల్ టీచర్ గా పనిచేస్తుండేది. అదే స్కూల్లో మెక్రాన్ స్టూడెంట్. పాఠాలు చెప్పే టీచర్ పై మనసు పారేసుకున్న మెక్రాన్ పెరిగి పెద్దవాడయ్యాక 2007 లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి వయసుతో పనిలేదని తేల్చి చెప్పిన ఈ రెండు జంటలు కిందటి వారం పారిస్ లో ఫొటోకు పోజిచ్చాయి. ట్రంప్ – మెలానియా అలాగే మెక్రాన్ – బ్రిగిట్ ఏజ్ గ్యాప్ 24 ఏళ్లే కావడం విశేషం.