అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు. జార్జియా ఫలితాలను ప్రభావితం చేసిన కేసులో ట్రంప్ అరెస్ట్ అయ్యారు.  అరెస్టు అయిన తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఖైదీగా ట్రంప్ మగ్ షాట్స్  ను అధికారులు తీసుకున్నారు. 

2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు డొనాల్డ్ ట్రంప్ పై నమోదయ్యాయి. ఈ మేరకు  జార్జియా జైల్‌ వద్ద పోలీసుల ఎదుట ట్రంప్ లొంగిపోయారు. స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి  ట్రంప్ లొంగిపోయారు.  రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. ట్రంప్‌ జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా ఆ దేశంలో  దాన్ని అరెస్ట్‌ కిందే పరిగణిస్తారు. ఇక అమెరికా చరిత్రలోనే అరెస్టు అయిన తొలి మాజీ అధ్యక్షుడు ట్రంప్. ఇక  ట్రంప్‌పై ఇప్పటి వరకు  నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.