నాపై నిరాధార ఆరోపణలు: ట్రంప్

నాపై నిరాధార  ఆరోపణలు: ట్రంప్

గ్రీన్స్ బరో: తనపై నమోదు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, హ్యాస్యాస్పదమైనవని అమెరికా మాజీ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కొట్టిపారేశారు. అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ కు  సంబంధించి శనివారం జార్జియా, నార్త్​ కరోలినాలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. 

అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఎవరు ఎన్ని రకాలుగా వెనక్కి లాగాలని ప్రయత్నించినా తాను వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడితీరుతానని ట్రంప్ స్పష్టం చేశారు. నేరాభియోగాలు చేయడమే కాదు.. తనను నేరస్తుడిగా నిరూపించినా సరే పోటీ నుంచి తప్పుకోబోనని డొనాల్డ్​ ట్రంప్​ తేల్చిచెప్పారు.