డబ్ల్యూహెచ్ వోకు నిధులు నిలిపి వేసిన ట్రంప్

డబ్ల్యూహెచ్ వోకు నిధులు నిలిపి వేసిన ట్రంప్

అమెరికాలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 6,14,211 కు చేరిగా.. 26,064 మంది చనిపోయారు. అయితే WHO కు నిధుల విషయంలో  డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. కరోనా ముప్పును హెచ్చరించడంలో WHO విఫలమైందన్న ట్రంప్.. ఆ సంస్థకు నిధులు  నిలిపివేశారు. కరోనా విజృంభిస్తుందన్న విషయాన్ని WHO దాచిపెట్టిందన్న ట్రంప్..మహమ్మారిగా ప్రకటించడంలో ఆలస్యం చేసిందన్నారు. చైనాకు WHO వంత పాడుతుందన్నారు ట్రంప్.. అమెరికా తీసుకున్న చాలా నిర్ణయాలను WHO వ్యతిరేకించిందన్నారు. అమెరికాలో కరోనా కేసులు పెరగడానికి కారణం WHO నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్య ముప్పు పొంచి ఉన్నప్పుడు  ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్ వో పై సమాచారం కోసం ఆధారపడతాయన్నారు. కానీ  కనీస బాధ్యతను నిర్వహించడం WHO విఫలమైందన్నారు. గత ఏడాది డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా 400 మిలియన్ డాలర్లు ఇచ్చింది.

అయితే WHO కు నిధులు నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేయలేక ట్రంప్..చైనా, WHO పై ఆరోపణలు చేస్తున్నారని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. నిధులు నిలిపివేయడం ఇది కరెక్టు సమయం కాదన్నారు.