బ్రెజిల్ నుంచి ప్రయణాలను అనుమతించమన్న అమెరికా

బ్రెజిల్ నుంచి ప్రయణాలను అనుమతించమన్న అమెరికా

వాషింగ్టన్ : కరోనా వ్యాప్తి నివారణ కు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైన దృష్టి పెట్టామన్నారు. ముఖ్యంగా బ్రెజిల్ నుంచి ప్రయాణాలను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్రెజిల్ నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటీవల బ్రెజిల్ లో కరోనా కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడి నుంచి వచ్చే వారితో తమ పౌరులకు ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. ఆ రిస్క్ చేసేది లేదని బ్రెజిల్ నుంచి అమెరికాకు ట్రావెల్ బ్యాన్ చేస్తామని స్పష్టం చేశారు. వైట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. ఐతే కరోనా నివారణలో బ్రెజిల్ కు కావాల్సిన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రెజిల్ కరోనా కేసుల్లో టాప్ త్రీ కి చేరింది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. డెత్ రేటు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. దాదాపు 2, 60, 000 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి.