అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్ : ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్.. సెకండ్ ప్లేస్ లో వివేక్

అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్ :  ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్..  సెకండ్ ప్లేస్ లో వివేక్

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ ​పార్టీ తరఫున వివేక్​ రామస్వామి దూసుకుపోతున్నారు. ప్రస్తు తం ఆయన రేసులో రెండోస్థానంలో కొన సాగుతున్నారు. పోల్స్ లో వివేక్ ​మూడోస్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. అయితే, రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రైమరీ పోల్స్ లో 39 శాతం మంది మద్దతుతో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మొదటి స్థానంలో ఉన్నారు. ట్రంప్​ తర్వాత వివేక్​ 13 శాతం ఓట్లతో రెండో స్థానంలో, భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీ హేలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రచారంలో పిజ్జాలు పంచిన ట్రంప్​

ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్  బుధవారం పిజ్జాలు పంచారు. అయోవా బెటెన్​ డార్ప్ లోని ఓ బార్​లో తన మద్దతుదారులకు ట్రంప్​ పిజ్జాలు పంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిజ్జాలు పంచిన అనంతరం ట్రంప్​ తన అభిమానుల క్యాప్​లు, టీషర్టులపై ఆటోగ్రాఫ్​ చేశారు.