ట్రంప్ సుంకాల యుద్ధం: కంపెనీ నియామకాలపై ప్రభావం.. తగ్గుతున్న ఉద్యోగాలు..

ట్రంప్ సుంకాల యుద్ధం: కంపెనీ నియామకాలపై ప్రభావం.. తగ్గుతున్న ఉద్యోగాలు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ ట్రేడ్ పాలసీల ప్రభావం అమెరికాలో ప్రారంభమైంది అలాగే అమెరికా, మాంద్యం గుప్పిట్లో ఉన్నట్లు కనిపిస్తోంది. దింతో అమెరికన్ కంపెనీలు ఉద్యోగుల నియామకాలను తగ్గించుకుంటున్నాయి. యుఎస్ లేబర్  డిపార్ట్మెంట్ ప్రకారం అమెరికన్ కంపెనీలు గత నెలలో 73 వేల ఉద్యోగులను చేర్చుకుంది, ఇది 1,15,000 అంచనా కంటే చాలా తక్కువ.

అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగం: మే, జూన్ నెలల్లో 2,58,000 మంది ఉద్యోగులను తొలగించడం దీనికి తోడు  నిరుద్యోగ రేటు 4.2%కి పెరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఇక అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 2,21,000 పెరిగింది. BMO క్యాపిటల్ మార్కెట్స్ చీఫ్ ఎకనామిస్ట్ స్కాట్ ఆండర్సన్ మాట్లాడుతూ అమెరికన్ లేబర్ మార్కెట్లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. సుంకం, వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని మేము అంచనా వేస్తున్నాము అని అన్నారు. 

Also Read : ఇంట్లోకి వరద వస్తే... గంగమ్మ వచ్చిందని పూజించిన పోలీస్ ఆఫీసర్..

అమెరికన్ ప్రజలపై సుంకాల ప్రభావం: వచ్చే ఎండా కాలంలోగా అన్ని US వాణిజ్య భాగస్వామి దేశాలతో విభేదాల ప్రభావం కనిపిస్తుందని,  ఇందుకు ప్రస్తుత నియామకాల్లో తగ్గుదల ఒక వార్నింగ్ అని అమెరికన్ ఆర్థికవేత్తలు హెచ్చరించారు. గ్లాస్‌డోర్ ఆర్థికవేత్త డేనియల్ జావో మాట్లాడుతూ మాంద్యం రావడం కాదు కానీ ఇప్పటికే వచ్చింది. US స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం పడిపోయింది. కార్మిక శాఖ విడుదల చేసిన డేటాను ట్రంప్ పక్కన పడేసారు. ఇది మాత్రమే కాదు, కార్మిక శాఖ డైరెక్టర్ ఎరికా మెక్‌ఎంటైర్‌ను తొలగించాలని అన్నారు. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ కాలంలో ఎరికా నియామకం జరిగింది. డోనాల్డ్ ట్రంప్ చాల దేశాలపై భారీగా సుంకాలు విధించారు,  దీని వల్ల అమెరికాలో తయారీ రంగాన్ని మళ్లీ బలంగా చేస్తాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, సుంకాలు అమెరికన్ ప్రజలనే ఎక్కువగా ప్రభావం చేస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు.