ట్రంప్ టారిఫ్స్ తో 66 శాతం భారత ఎగుమతులపై ఎఫెక్ట్.. లాభపడనున్న వియత్నాం..!

ట్రంప్ టారిఫ్స్ తో 66 శాతం భారత ఎగుమతులపై ఎఫెక్ట్.. లాభపడనున్న వియత్నాం..!

2025 ఆగస్టు 27 నుంచి అమెరికా ప్రభుత్వం భారత్‌ నుంచి దిగుమతులపై 50% ట్యారిఫ్స్ అమలులోకి వస్తున్నాయి. ఈ నిర్ణయం భారతంలోని టెక్స్ టైల్, డైమండ్స్, జ్యువెలరీ, కార్పెట్లు, ఫర్నిచర్ వంటి ప్రధాన ఎగుమతుల రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. మెుత్తంగా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల్లో ఎక్కువ శాతం టారిఫ్స్ హీట్ చూడనున్నాయని తెలుస్తోంది.

అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతయ్యే మొత్తం ఎగుమతుల్లో సుమారు 66% వస్తువులు సుంకాల ప్రభావాన్ని చూస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదించింది. ఈ ఉత్పత్తుల విలువసుమారు 60.2 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని పేర్కొంది. 50% ట్యారిఫ్‌కు లోనైన ఉత్పత్తుల కారణంగా  ఎగుమతులు 70% వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. ఇది భారత ఎగుమతుల మొత్తం మొత్తాన్ని 2025 ఆర్థిక సంవత్సరంలో 86.5 బిలియన్ డాలర్ల నుండి 2026 ఆర్థిక సంవత్సరంలో 49.6 బిలియన్ డాలర్లకి తగ్గిపోవాలని నివేదించబడింది.

ఈ పరిణామాలు అమెరికా మార్కెట్లకు భారత్ దూరం కావటంతో పాటు ఉద్యోగాల నష్టం, ఆర్థిక వ-ృద్ధి నెమ్మదించటం వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది భారత్. దీంతో మరోవైపు వాణిజ్య అవకాశాలను చైనా, వియత్నాం, మెక్సికో వంటి దేశాలు పొందుతూ భారత వ్యాపారవాటాను లాభాలుగా మార్చుకోవచ్చని నివేదిక చెప్పింది. అమెరికా పెంచిన టారిఫ్స్ కారణంగా భారత ఆర్థిక వృద్ధి సుమారు 0.9 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. భారత్ ఇందుకు వ్యతిరేకంగా వ్యూహాత్మక మార్పులు చేపట్టి, రవాణా రంగంలో మునుపటి స్థితిని కోల్పోకుండా ప్రయత్నించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.

టారిఫ్స్ ఎఫెక్ట్ వల్ల కలిగే కీలక నష్టాలు..
* 2025 ఆగస్టు 27 నుంచి 50% ట్యారిఫ్‌లు అమలులోకి వస్తాయి.
* టెక్స్ టైల్స్, డైమండ్స్, జ్యువెలరీ, ఫర్నిచర్, రొయ్యలు, ఆర్గానిక్ కెమికల్స్, మెటల్స్, మెషినరీ, కార్పెట్స్ వంటి రంగాలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి.
* భారత ఎగుమతులు 70% వరకు తగ్గే అవకాశముంది.
* ఉపాధి నష్టాలు, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం.
* ప్రత్యామ్నాయ సరఫరాదారులు: చైనా, వియత్నాం, మెక్సికో.
* భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5% నుండి 5.6%కి పడిపొస్తుంది.