
Trump Tariff Stocks: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అదనపు టారిఫ్స్ భారతదేశంపై ఆగస్టు 27 నుంచి అమలులోకి రాబోతున్నాయి. దీంతో వినాయకచవితి రోజు నుంచి భారతీయ దిగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్స్ అమలులోకి రాబోతున్నాయి. దీనిపై క్లారిఫికేషన్ ఇస్తూ అమెరికా ప్రభుత్వం నోటిఫై చేయటం భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి సంబంధించి తాజాగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోం లాండ్ సెక్రటరీ నోటీసులో ప్రకటించింది. ఇది ఇండియన్ ఇన్వెస్టర్లు అప్రమత్తం అవుతున్నారు.
అమెరికా టారిఫ్స్ ప్రభావంతో దేశీయంగా మెటల్, ఆటో, రియల్ ఎస్టేట్, ఐటీ, టెక్స్ టైల్ సహా మరిన్ని రంగాలకు చెందిన స్టాక్స్ ప్రభావితం అవుతున్నాయి. అమెరికాకు ఎగుమతులపై ఆధారపడిన అనేక కంపెనీల షేర్లు ఈరోజు ఇంట్రాడేలో నష్టాపోయాయి. నేడు ఇంట్రాడేలో అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ లూజర్ గా నిలవగా దీని తర్వాత వెల్ స్పన్, సెయిల్, టాటా స్టీల్ భారీ నష్టాలను నమోదు చేశాయి.
నష్టాల్లో ఉన్న మెటల్ స్టాక్స్ లిస్ట్..
హిందాల్కొ, నాల్కొ, హిందుస్థాన్ కాపర్, ఎన్ఎమ్డీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, హిందుస్థాన్ కాపర్, జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ కంపెనీ షేర్లు ఇవాళ ఇంట్రాడేలో 1 శాతానికి పైగా నష్టపోయి తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
రియల్టీ రంగంలో కుప్పకూలిన స్టాక్స్..
ప్రధానంగా ట్రంప్ టారిఫ్స్ దేశీయంగా ఉన్న రియల్టీ సంస్థలపై ముడిసరుకుల ధరల పెరుగుదలతో పరోక్షంగా ప్రభావాన్ని చూపుతాయని తేలింది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థల లాభదాయకతను దెబ్బతీస్తాయని తెలుస్తోంది. దీంతో డీఎల్ఎఫ్, లోధా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, సోబా అండ్ ఒబరాయ్ రియల్టీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, రేమాండ్, అనంత్ రాజ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
►ALSO READ | VI Stock: కేంద్రం క్లారిటీతో కుప్పకూలిన వొడఫోన్ ఐడియా స్టాక్.. 10 శాతం క్రాష్!
అల్లాడిపోతున్న ఆటో స్టాక్స్..
యూఎస్ టారిఫ్స్ కారణంగా ఆటో పార్ట్స్ తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా మార్కెట్లు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున టారిఫ్స్ తమ వ్యాపారాన్ని కష్టతరంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ రంగంలోని అనేక లిస్టెస్ కంపెనీలు నేడు ప్రభావితం అయ్యాయి. ప్రధానంగా ఎంఆర్ఎఫ్, టీవీఎస్ మోటార్స్, అషోక్ లేలాండ్, బోస్ట్చ్, మారుతీ సుజుకీ స్టాక్స్ అత్యధికంగా 2 శాతం వరకు పడిపోయాయి.