వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అభ్యర్థికి వివేక్ రామస్వామిపై సరైన వ్యక్తి : ట్రంప్

వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అభ్యర్థికి వివేక్ రామస్వామిపై సరైన వ్యక్తి : ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవి కోసం తనతోపాటు పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి.. వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అభ్యర్థిగా బాగా సరిపోతారని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇండో అమెరికన్ అయిన రామస్వామి.. నిజంగా మంచి వ్యక్తి అని పొగడ్తలు కురిపించారు. ఆయనలో చాలా ఎనర్జీ ఉందని అన్నారు. “ఆయన (వివేక్ రామస్వామి) తెలివైన వ్యక్తి. యువకుడు. పైగా చాలా ప్రతిభను కలిగి ఉన్నారు. 

ఆయన చాలా మంచివారని నేను అనుకుంటున్నాను. నిజంగా తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నారని నేను భావిస్తున్నాను’’ అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్‌‌ కోసం పోటీ పడుతున్న వారిలో ట్రంప్ ముందంజలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు.