5G నెట్ వర్క్ లో మరో ముందడుగు

5G నెట్ వర్క్ లో మరో ముందడుగు

దేశంలో 5 జి ట్రయల్స్ కోసం  టెలికాం సంస్థలకు స్పెక్ట్రంను కేటాయించింది టెలికాం విభాగం (డిఓటి) . ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్‌తో సహా పలు చోట్ల ఈ ట్రయల్స్ జరగనుంది. "టెలికాం ఆపరేటర్లకు 700 Mhz బ్యాండ్, 3.3-3.6 గిగాహెర్ట్జ్ (Ghz) బ్యాండ్ , 24.25-28.5 Ghz బ్యాండ్లలో స్పెక్ట్రంను కేటాయించారు.  చైనా కంపెనీల నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా 5 జి ట్రయల్స్ నిర్వహించడానికి రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టిఎన్‌ఎల్ నుండి వచ్చిన దరఖాస్తులను మే 4 న డిఓటి ఆమోదించింది.

ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్ , సి-డాట్‌లతో 5జి ట్రయల్స్‌ నిర్వహించనున్నాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన దేశీయ టెక్నాలజీ ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించనుంది. మొత్తం 6 నెలల పాటు ఈ ట్రయల్స్ జరగనుంది. DoT ప్రకారం, 5G టెక్నాలజీ 4G కన్నా పది రెట్లు మెరుగైన డౌన్‌లోడ్ వేగాన్ని, మూడు రెట్లు ఎక్కువ స్పెక్ట్రం సామర్థ్యాన్ని అందిస్తుంది.