ఆక్స్‌ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్

ఆక్స్‌ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్

కరోనాకు యాంటీబాడీలు, టీ సెల్స్ ఉత్పత్తి
కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ విజయవంతం
సెప్టెంబర్ నాటికి టీకా వచ్చేందుకు చాన్స్

లండన్: కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ దిశగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు కీలక ముందడుగు వేశారు. వ్యాక్సిన్ తయారీలో భాగంగా మనుషులపై జరిపిన ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు. తాము తయారు చేసిన టీకా మనుషుల్లో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ బాడీలను, కిల్లర్ టీ సెల్స్ ను ఉత్పత్తి చేయగలిగినట్లు వారు తెలిపారు. ఈ టీకా కరోనా నుంచి డబుల్ ప్రోటెక్షన్ ఇవ్వవచ్చని చెప్తున్నారు. టీకాలతో ఏర్పడే యాంటీబాడీలు కొన్ని నెలల వరకుమాత్రమే ఉంటాయని, టీ సెల్స్ మాత్రం కొన్నేండ్లవరకూ ఉండవచ్చని ఇదివరకే పలు రీసెర్చ్ లలో తేలింది. దీంతో ఆక్స్ ఫర్డ్ టీకా కరోనా నివారణకు బాగా ఉపయోగపడే చాన్స్ ఉందని భావిస్తున్నారు. అయితే ఈ టీకా దీర్ఘకాలం పాటు మనుషుల్లో ఎఫెక్టివ్ గా పని చేస్తుందా? లేదా? అన్నది తదుపరి ట్రయల్స్ లోనే తేలుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. సెకండ్, థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లోనూ ఇది మనుషులకు బాగా, సేఫ్ గా పని చేస్తున్నట్లు తేలితేనే సక్సెస్ అయినట్లు భావించాలని అంటున్నారు. మొత్తంగా అన్నీ సవ్యంగా జరిగితే ఈ టీకా వచ్చే సెప్టెంబర్ నాటికి మార్కె ట్లోకి వచ్చే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని జెన్నర్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు ఈ టీకాను తయారుచేస్తుండగా, ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ దీనిని
ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి తీసుకురానుంది.

For More News..

అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి.. ఏడాదిలో కొత్త బిల్డింగ్

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు

సర్కార్ తప్పులు.. ఆఫీసర్లకు శిక్షలు