టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డు

టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డు

కరీంనగర్ టౌన్,వెలుగు:  ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ 2025అవార్డుకు రజనీ ఫెర్టిలిటీ సెంటర్ చైర్మన్, రెనే హాస్పిటల్ ఎండీ  డా.బంగారి రజనీ ప్రియదర్శిని ఎంపికయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయిలో వైద్య రంగంలో అత్యున్నత సేవలకు గానూ డాక్టర్లకు ఈ అవార్డులను ఏటా అందజేస్తుంది. దీనిలో భాగంగా కేవలం వైద్యమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న రజనీ ప్రియదర్శినిని ఎంపిక చేశారు.

హైదరాబాద్‌‌లోని తాజ్ దక్కన్‌‌లో జరిగిన  కార్యక్రమంలో ఎల్వీ  ప్రసాద్ హాస్పిటల్ చైర్మన్  డా.నాగేశ్వర్ రావు ఈ అవార్డును అందజేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు యువదంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని, దానిని అధిగమించాలంటే ఆరోగ్య కరమైన జీవన విధానం, సరైన వ్యాయామం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా రెనే హాస్పిటల్ చైర్మన్ డా. బంగారి స్వామి ఆమెను అభినందించారు.