చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉంది:ఎయిమ్స్ మాజీ చీఫ్​ గులేరియా

చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉంది:ఎయిమ్స్ మాజీ చీఫ్​ గులేరియా

న్యూఢిల్లీ : చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉందని, మన వ్యాక్సినేషన్ డ్రైవ్  బాగుందని ఎయిమ్స్  మాజీ చీఫ్​ డాక్టర్  రణ్ దీప్  గులేరియా అన్నారు. దేశంలో కేసులు ఎక్కువగా నమోదు కాకపోయినా కరోనా విషయం లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో బుధవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.

‘‘కరోనా కేసుల విషయం లో సరైన సర్వైలెన్స్ అవసరం. ఎక్కడైనా కేసులు పెరగడం ప్రారంభమైతే, వెంటనే ఆ ప్రాంతంలో టెస్టులు చేయొచ్చు. దీంతో కొత్త వేరియంట్లు ఏమైనా బయటపడితే వ్యాప్తిని అడ్డుకోవచ్చు. మన వ్యాక్సినేషన్  డ్రైవ్ బాగుంది. హైరిస్క్ లో ఉన్న చాలా మంది ఇప్పటికే బూస్టర్  డోసు తీసుకు న్నారు” అని గులేరియా పేర్కొన్నారు.