డాక్టర్ రెడ్డీస్ చేతికి .. సనోఫీ వ్యాక్సిన్ల పంపిణీ

డాక్టర్ రెడ్డీస్ చేతికి .. సనోఫీ వ్యాక్సిన్ల పంపిణీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తమ వ్యాక్సిన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను భారతదేశంలో ప్రమోట్​ చేయడానికి,  పంపిణీ చేయడానికి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్​తో ఒప్పందం కుదుర్చుకున్నామని సనోఫీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ ఇండియా ప్రకటించింది.  సనోఫీ  పీడియాట్రిక్,  అడల్ట్ వ్యాక్సిన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హెక్సాక్సిమ్, పెంటాక్సిమ్, టెట్రాక్సిమ్, మెనాక్ట్రా, ఫ్లూక్వాడ్రీ, అడాసెల్,  అవాక్సిమ్ 80యూలను ప్రమోట్ చేయడానికి,  పంపిణీ చేయడానికి ప్రత్యేక తమ ప్రత్యేక హక్కులు వచ్చాయని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డాక్టర్ ​రెడ్డీస్ ​ప్రకటించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి డేటా  డేటా ప్రకారం ఈ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాదాపు రూ. 426 కోట్ల అమ్మకాలను సాధించాయి.  సనోఫీతో ఒప్పందం వల్ల టీకా విభాగంలో డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత ఎదుగుతామని, భారతదేశంలో రెండవ స్థానానికి చేరుకుంటామని  డాక్టర్ రెడ్డీస్  బ్రాండెడ్ మార్కెట్స్ సీఈఓ(ఇండియా,  ఎమర్జింగ్ మార్కెట్స్) ఎంవీ రమణ తెలిపారు.