ఈ నెల 15న ‘లడ్‌కీ’ వస్తోంది

ఈ నెల 15న ‘లడ్‌కీ’ వస్తోంది

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం ‘లడ్‌కీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయికగా పూజా బాలేకర్‌ నటించింది. దుబాయ్‌కి చెందిన నిర్మాణ సంస్థ ఆర్ట్‌సీ మీడియా, చైనాకు చెందిన బిగ్‌ పీపుల్‌ సంస్థతో కలిసి ఆర్జీవీ ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అమ్మాయి’గా డబ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, చైనా భాషల్లో ఈ సినిమను విడుదల చేయనున్నారు. అయితే చైనీస్‌లో ‘గర్ల్‌ డ్రాగన్‌’ పేరుతో దాదాపు 40 వేల థియేటర్‌లలో ఈ మూవీ విడుదల కానుండడం విశేషం. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఇంత భారీస్థాయిలో రిలీజ్‌ చేయడం ఇదే మొదటిసారి.