ముగిసిన డ్రేపర్ స్టార్టప్ ప్రోగ్రామ్

ముగిసిన డ్రేపర్ స్టార్టప్ ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: డ్రేపర్ స్టార్టప్ హౌస్ ఇండియా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన భారతదేశంలోనే తొలి డ్రేపర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ శుక్రవారం (ఆగస్టు 01) రాత్రి  డెమో డే తో ముగిసింది. 12 రోజుల యాక్సిలిరేటర్ ప్రోగ్రామ్ ముగింపులో దేశవ్యాప్తంగా ఉన్న 14  స్టార్టప్‌‌‌‌లకు చెందిన 16 ఎంట్రప్రెనార్లు తమ స్టార్టప్‌‌‌‌ల గురించి వివరించారు.  

ఫిన్​స్టోన్​ ఏఐ ఫౌండర్​, -హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి రుషికేశ్  చవాన్,  బెంగళూరుకు చెందిన జాల్ట్స్ ఫౌండర్​ శుభమ్​ శర్మ శాన్ ఫ్రాన్సిస్కో డ్రేపర్ యూనివర్సిటీలో జరిగే హీరో ట్రైనింగ్ ప్రోగ్రామ్​కు ఎంపికయ్యారు. వీరికి 15 వేల డాలర్ల చొప్పున చెల్లించారు.

 ఫిన్​స్టోన్​  ఏఐ ఆటానమస్  ట్రేడింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్ కాగా, జాల్ట్స్ బ్లాక్‌‌‌‌చైన్ ఆధారిత ఫిన్‌‌‌‌టెక్  స్టార్టప్. ఇది ప్రభుత్వాలు,  ఆర్థిక సంస్థల కోసం కొత్తతరం ఆర్థిక ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది.  ఈ సందర్భంగా పలు స్టార్టప్​ల ఫౌండర్లు తమ బిజినెస్​ ఐడియాలు ప్రదర్శించారు.