
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాగ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నానా పటేలె, రామ్‌టెక్ అభ్యర్థి కిషోర్ తరపున ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్… దేశంలోని రూ.20 కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ.72,000 అందేలా చూడటం, వారిని ఆదుకోవడం తన డ్రీమ్ ఐడియా అన్నారు. మీ అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తాననే అబద్ధాలు చెప్పనని… ఎందుకంటే అబద్ధాలు 23 నెలల కంటే ఎక్కువ చెల్లుబాటు కావన్నారు. మీతో 5 ఏళ్లు కలిసి పనిచేయాలనుకుంటున్నాను’ అని రాహుల్ చెప్పారు. ‘న్యాయ్’ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని బీజేపీ వాళ్లు అడుగుతున్నారన్నారు. నాగపూర్‌లో పతంజలికి భూమి కేటాయించినప్పుడు కానీ, ప్రాజెక్టును హ్యాండిల్ చేసే డబ్బులు, ప్రాజెక్టు నిర్వహణా సామర్థ్యం లేనప్పటికీ రాఫెల్ ఆఫ్ సెట్ కాంట్రాక్ట్‌ను అనిల్ అంబానీకి కేటాయించినప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వేయలేదని ఆయన నిలదీశారు. అంబానీ, చోక్సీ, నీరవ్ మోడీ వంటి వారి జేబుల్లోంచి డబ్బులు పట్టుకొచ్చి మరీ ‘న్యాయ్’ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు రాహుల్.