స్మగ్లింగ్ ఐడియా : బిస్కెట్లు, కేక్ బాక్సుల్లో పాములు.. వాటికి రంగు

స్మగ్లింగ్ ఐడియా : బిస్కెట్లు, కేక్ బాక్సుల్లో పాములు.. వాటికి రంగు

ఇటీవలి కాలంలో స్మగ్లర్లు కొత్త కొత్త.. క్రియేటివ్ ఐడియాస్ తో తమ పనిని కానిచ్చేస్తున్నారు. బంగారం, గంజాయి, అరుదైన వస్తువులు, జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇదే తరహాలో బిస్కెట్లు/కేక్ ప్యాకెట్లలో పాములను తీసుకువెళ్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. డిసెంబర్ 20న బ్యాంకాక్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి నుంచి 9 చిన్న కొండచిలువలు (పైథాన్ రెజియస్), 2 కార్న్ స్నేక్స్ ను (పాంథెరోఫిస్ గుట్టటస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ చట్టం 1962 కింద పాములను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యుసిసిబి), వెస్ట్రన్ రీజియన్ (డబ్ల్యుఆర్), నవీ ముంబై అధికారులు తనిఖీ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న జంతువుల వివరాలను వెల్లడించారు. దేశీయం కాని ఈ పాముల అక్రమ దిగుమతిపై స్పందించిన ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్, WCCB, WR ఈ సరీసృపాలను బ్యాంకాక్‌కు తిరిగి పంపాలని ఆర్డర్స్ జారీ చేశారు. అంతకుముందు సరీసృపాలను స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌కు అప్పగించారు.