కాఫీ ప్రియులకు శుభవార్త

కాఫీ ప్రియులకు శుభవార్త

మెల్​బోర్న్: కాఫీ ప్రియులకు శుభవార్త.. రోజుకు 2, 3 కప్పుల కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్​ తగ్గుతుందని ఆస్ట్రేలియా సైంటిస్టులు చెప్పారు. అంతేకాదు కాఫీ తాగనోళ్లతో పోలిస్తే ఎక్కువకాలం బతుకుతరని రీసెర్చిలో తేలిందట. మెల్​బోర్న్​లోని బేకర్​ హార్ట్​ అండ్​ డయాబెటిస్​ రీసెర్చి ఇనిస్టిట్యూట్​ కు చెందిన సైంటిస్టులు దాదాపు 30 వేల మంది వలంటీర్లపై సుదీర్ఘంగా రీసెర్చి చేసి మరీ ఈ విషయాన్ని కనుకున్నరు. 40 నుంచి 69 ఏండ్ల వయసున్న వారిని ఎంపిక చేసి కాఫీ తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులను జాగ్రత్తగా గమనించారు. మిగతావాళ్లతో పోలిస్తే రోజూ రెండు, మూడు కప్పుల కాఫీ తాగేటోళ్లలో గుండె కొట్టుకునే స్పీడ్​లో పెద్దగా మార్పులు(ఇరెగ్యులర్​ హార్ట్​బీట్) కనిపించలేదని వారు చెప్పారు. అయితే, రోజూ నాలుగైదు కప్పులు లాగించే వాళ్లలో ఈ ప్రయోజనాలు  తగ్గుతున్నాయని కూడా చెప్పారు.