శ్రీశైలంలో డ్రోన్ కలకలం..ప్రధాన ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్

శ్రీశైలంలో డ్రోన్ కలకలం..ప్రధాన ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్

నంద్యాల:శ్రీశైలం ఆలయం దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది.రాత్రి సమయంలో శ్రీశైలం ప్రధాన  ఆలయంపై డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అనుమతిలేని డ్రోన్ ఆలయంపై చక్కర్లు కొడుతున్నా సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టకపోవడం గమనార్హం. శ్రీశైలం ప్రధాన ఆలయంపై డ్రోన్ ఎగురుతున్న వీడియోలు వైరల్ కావడంలో విషయం తెలిసింది. 

సోమవారం (సెప్టెంబర్8) రాత్రి సమయంలో శ్రీశైలం ప్రధాన ఆలయ పై డ్రోన్ చక్కర్లు కొట్టింది. అనుమతిలేని డ్రోన్ చక్కర్లు కొట్టినా ఆలయ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేదు. డ్రోన్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అలర్ట్ అయ్యారు ఆలయ సి ఎస్ ఓ.

►ALSO READ | తిరుమల శ్రీవారి సేవలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫ్యామిలీలు

ఎవరైనా యాత్రికులు డ్రోన్ ఆపరేట్ చేశారా..? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. పోలీసుల సహాయంతో వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం ఆలయ అధికారులు చెబుతున్నారు.